Sircilla: నెల రోజుల్లో మండల కమిటీల ఏర్పాటు: మాదిగ సంక్షేమ సంఘం కన్వీనర్ సుధాకర్

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాదిగ సంక్షేమ సంఘం జిల్లా కమిటీని ఏర్పాటు చేసినట్లు కన్వీనర్ కొట్టపల్లి సుధాకర్ తెలిపారు.

KALEEM, SIRICILLA
Published on: 6 Sept 2026 9:57 PM IST
Sircilla
X

Sircilla: నెల రోజుల్లో మండల కమిటీల ఏర్పాటు: మాదిగ సంక్షేమ సంఘం కన్వీనర్ సుధాకర్

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతనంగా మాదిగ సంక్షేమ సంఘం జిల్లా కమిటీని ఏర్పాటు చేసినట్లు జిల్లా కన్వీనర్ కొట్టపల్లి సుధాకర్ తెలిపారు. తనను జిల్లా కన్వీనర్‌గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నెల రోజుల్లో జిల్లాలోని అన్ని మండలాలకు కమిటీలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాదిగ సంక్షేమ సంఘం జిల్లా కో-కన్వీనర్లుగా నియమితులైన కత్తెరపాక రవీందర్, గుడిసె మనోజ్, బొడ్డు నారాయణ, తాళ్లపల్లి కళ్యాణ్‌లను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. మాదిగ సంక్షేమ సంఘం కోసం పూర్తిస్థాయిలో ముందుండి పనిచేస్తానని చెప్పారు. మాదిగ సమాజానికి ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటి పరిష్కారం కోసం ముందుండి పోరాడుతానన్నారు.

మాదిగ సమాజంలో విద్య, ఉపాధి, ఆర్థిక అభివృద్ధి, సామాజిక గౌరవం కోసం ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

సమాజంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని సుధాకర్ అన్నారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

ఐక్యతే సమాజానికి బలం

మాదిగ సమాజంలో ఐక్యతే తమ బలమని సుధాకర్ అన్నారు. చిన్న చిన్న విభేదాలను పక్కనపెట్టి అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పెద్దల అనుభవం, యువత శక్తి, మహిళల భాగస్వామ్యంతో సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు కోసం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం నాయకులు కత్తెర దేవదాస్, బూరుగుమోహన్, కత్తెరపాక సుధాకర్, ఆవునూరి వెంకట్ రాములు, ఆవునూరి ప్రభాకర్, తంగళ్లపల్లి దేవయ్య, ఎడ్ల నరేష్ కుమార్, డప్పుల అశోక్, కొంకటి రమేష్, కుమ్మరి అనిల్, బొర్ర రవి తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story