Sircilla: మార్కండేయ స్వామి దేవాలయంలో నూలు పౌర్ణమి కరపత్రం ఆవిష్కరణ

Sircilla: సిరిసిల్ల శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న నూలు పౌర్ణమి వేడుకల కరపత్రాన్ని పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.

KALEEM, SIRICILLA
Published on: 27 Aug 2026 11:12 PM IST
Sircilla
X

Sircilla: మార్కండేయ స్వామి దేవాలయంలో నూలు పౌర్ణమి కరపత్రం ఆవిష్కరణ

సిరిసిల్ల: సిరిసిల్ల శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న నూలు పౌర్ణమి వేడుకలకు సంబంధించిన కరపత్రాన్ని పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గురువారం ఆవిష్కరించారు.

దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, కార్యదర్శి మండల సత్యం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం నిర్వహించనున్న రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఉదయం 5 గంటలకు మార్కండేయ స్వామి సుప్రభాతం, 6 గంటలకు అభిషేకం, నిత్యపూజ, హారతి, 8 గంటలకు శ్రీ మార్కండేయ స్వామి యజ్ఞం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం జందెములు ధరించడం, రక్షాబంధనం కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.

సాయంత్రం 4 గంటలకు శ్రీ మార్కండేయ స్వామి శోభాయాత్రను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సమస్త పద్మశాలి కులబాంధవులు అధిక సంఖ్యలో హాజరై నూలు పౌర్ణమి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.

కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు మోర రవి, గాజుల బాలయ్య, కోశాధికారి ఎల్లె శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కోడం శ్రీనివాస్, డైరెక్టర్ బూర శ్రీనివాస్, ఆడెపు కనకరాజు, సామల శ్రీనివాస్, చిలక కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story