Sircilla: అగ్గిపెట్టె చీరకు ఫ్యాషన్ హంగులు సిరిసిల్ల చేనేతకు కొత్త ఊపు!
Sircilla: సిరిసిల్ల అగ్గిపెట్టె పట్టు చీరలపై ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థినుల హ్యాండ్ ప్రింటింగ్ వర్క్. మధుబని, తంజావూరు డిజైన్లతో చేనేతకు సరికొత్త రూపు.
Sircilla: అగ్గిపెట్టె చీరకు ఫ్యాషన్ హంగులు సిరిసిల్ల చేనేతకు కొత్త ఊపు!
Sircilla: సాంప్రదాయ చేనేతకు ఆధునిక ఫ్యాషన్‌ను జోడిస్తూ నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థినులు లోకేశ్వరి, ప్రియాంక, సంధ్య, అంజలి వినూత్న ప్రయోగం చేశారు. సిరిసిల్ల కాటన్ చీరలు, పట్టు చీరలు, అగ్గిపెట్టెలో ఇమిడే ప్రసిద్ధ పట్టుచీరలపై మధుబని, తంజావూరు శైలిలో హ్యాండ్ ప్రింటింగ్ వర్క్ చేసి కొత్త రూపునిచ్చారు.
యువతను ఆకట్టుకునేలా రూపొందించిన ఈ డిజైన్లు చీరల అందాన్ని మరింత పెంచుతున్నాయి. నాణ్యతను కాపాడుతూ ఆధునిక డిజైన్లు జోడించడం వల్ల మార్కెట్లో డిమాండ్ పెరిగే అవకాశముందని విద్యార్థినులు తెలిపారు.
ఈ వినూత్న ప్రయత్నం వల్ల స్థానిక నేతన్నలకు అదనపు ఆదాయం లభించడంతో పాటు సిరిసిల్ల చేనేతకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు వచ్చే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చేనేత రంగంలో ఇలాంటి సృజనాత్మక ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని స్థానికులు కోరుతున్నారు.




