Sircilla: కార్మికుల మనోవికాస సదస్సు ఆరోగ్య పరిరక్షణే ధ్యేయం!
Sircilla: సిరిసిల్ల గణేష్ నగర్‌లో మైండ్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో కార్మికుల మనోవికాస సదస్సు.
Sircilla: కార్మికుల మనోవికాస సదస్సు ఆరోగ్య పరిరక్షణే ధ్యేయం!
Sircilla: కార్మికులు తమ ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ సూచించారు. మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో సిరిసిల్ల గణేష్ నగర్‌లో నిర్వహించిన కార్మికుల మనోవికాస సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.
కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, పని ఒత్తిడి కారణంగా కార్మికులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీపీ, షుగర్, అధిక బరువు, గుండె సంబంధిత వ్యాధులు వంటి జీవనశైలి సమస్యలు కార్మికుల్లో పెరుగుతున్నాయని తెలిపారు.
క్రమం తప్పకుండా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ఉప్పు, చక్కెర వినియోగాన్ని తగ్గించడం అవసరమని సూచించారు. అలాగే పొగాకు, గుట్కా, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, ప్రతిరోజూ వ్యాయామం, ధ్యానం, శ్వాసాభ్యాసాలు చేయడంతో పాటు తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోవాలని పిలుపునిచ్చారు.
మానసిక సమస్యలు ఎదురైనప్పుడు మనోవికాస కేంద్రాన్ని సంప్రదించి కౌన్సెలింగ్ పొందాలని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం, సమాజ అభివృద్ధికి కార్మికులు మరింతగా దోహదపడగలరని పున్నంచందర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది, బూర శ్రీమతి, కొండ ఉమ, రాపెల్లి లతతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.




