Sircilla: సిరిసిల్ల గాంధీ చౌక్‌లో సంఘం డెయిరీ నూతన పార్లర్ ప్రారంభం!

Sircilla: రాజన్న సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సంఘం డెయిరీ పార్లర్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి ప్రారంభించారు.

KALEEM, SIRICILLA
Published on: 27 Nov 2026 5:02 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల గాంధీ చౌక్‌లో సంఘం డెయిరీ నూతన పార్లర్ ప్రారంభం!

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్‌లో ఏర్పాటు చేసిన సంఘం డెయిరీ నూతన పార్లర్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో నూతన వ్యాపారాలు, స్వయం ఉపాధి అవకాశాలు పెరగడం సంతోషకరమని అన్నారు.

ప్రజలకు నాణ్యమైన పాల ఉత్పత్తులను అందిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని పొందాలని పార్లర్ నిర్వాహకులకు సూచించారు. నూతనంగా పార్లర్‌ను ప్రారంభించిన యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంఘం డెయిరీకి చెందిన వివిధ రకాల ఉత్పత్తులు, వాటి నాణ్యత గురించి కంపెనీ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో సంఘం డెయిరీ పార్లర్ నిర్వాహకులు మహమ్మద్ నసీర్, మజీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ సమీ, మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు ఎం.డి. సలీం, మజీద్ కమిటీ మాజీ అధ్యక్షులు యూసఫ్, సత్తార్, ఖైరాత్, అహ్మద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA