Sircilla: ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి కల్యాణం చైర్‌పర్సన్!
Sircilla: శ్రీ శివ సాయి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన శ్రీ పెద్దమ్మ–పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి
Sircilla: ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి కల్యాణం చైర్‌పర్సన్!
సిరిసిల్ల: స్థానిక 21వ వార్డులో శ్రీ శివ సాయి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన శ్రీ పెద్దమ్మ–పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవంలో మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి జిందం కళ చక్రపాణి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేసేలా శ్రీ పెద్దమ్మ–పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహిస్తున్న శ్రీ శివ సాయి ముదిరాజ్ సంఘం సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.
శ్రీ పెద్దమ్మ–పెద్దిరాజుల చల్లని దీవెనలతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలందరూ తమ తమ రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే సంఘం భవిష్యత్తులో మరిన్ని సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా శివ సాయి ముదిరాజ్ సంఘం సభ్యులు మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణితో పాటు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎలుక వెంకటేశం దంపతులు, మెరుగు మంజుల శ్రీనివాస్, లింగంపల్లి గంగరాజు, కూరపాటి శ్రీశైలం, బీఆర్ఎస్ సిరిసిల్ల శాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మాజీ కౌన్సిలర్ వేముల రవి, శివ సాయి ముదిరాజ్ సంఘం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.




