Sircilla: సుందరకాండ జ్ఞాన యజ్ఞ సప్తహంలో మున్సిపల్ చైర్‌పర్సన్!

Sircilla: సుందరకాండ జీవితానికి గొప్ప మార్గదర్శకం సిరిసిల్ల అభయాంజనేయ స్వామి ఆలయంలో సుందరకాండ జ్ఞాన యజ్ఞ సప్తహంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి.

KALEEM, SIRICILLA
Published on: 3 Oct 2026 7:49 PM IST
Sircilla
X

Sircilla: సుందరకాండ జ్ఞాన యజ్ఞ సప్తహంలో మున్సిపల్ చైర్‌పర్సన్!

సిరిసిల్ల: స్థానిక 3వ వార్డులోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న సుందరకాండ జ్ఞాన యజ్ఞ సప్తహం కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన నారద భక్తి సూత్రాలు, సుందరకాండ ప్రవచన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రవచనాలను ఆలకించారు.

ఈ సందర్భంగా జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ.. పవిత్రమైన నారద భక్తి సూత్రాలు, సుందరకాండ ప్రవచన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అభయాంజనేయ స్వామి దేవాలయ అధ్యక్షులు చేరాల ప్రసాద్, కార్యవర్గ సభ్యులు, భక్తులకు అభినందనలు తెలిపారు. ప్రవచనాలు చేస్తున్న చిన్మయ మిషన్ ఆచార్యులు బ్రహ్మచారి శ్రీ అక్షయ చైతన్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సుందరకాండ కేవలం రామాయణంలోని ఒక భాగం మాత్రమే కాదని.. మన జీవితానికి ఎన్నో గొప్ప సందేశాలను అందించే ఆధ్యాత్మిక మార్గదర్శకమని అన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మంచి ఆలోచనలను పెంపొందించడంతో పాటు, పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాల విలువలను తెలియజేస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని.. ప్రతి కుటుంబంపై శ్రీరామచంద్రుల ఆశీస్సులు, ఆంజనేయస్వామి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. అక్టోబర్ 9వ తేదీ శుక్రవారం వరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు ప్రవచనాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో కార్యక్రమానికి హాజరై ప్రవచనాలను ఆలకించాలని కోరారు.

అనంతరం చిన్మయ మిషన్ ఆచార్యులు బ్రహ్మచారి శ్రీ అక్షయ చైతన్య నిర్వహించిన నారద భక్తి సూత్రాలు, సుందరకాండ ప్రవచనాలను జిందం కళా చక్రపాణితో పాటు భక్తులు ఆలకించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA