Sircilla: సిరిసిల్లలో ఘనంగా జిల్లా స్థాయి యువజనోత్సవాలు-2026 ప్రారంభం!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు-2026 ఘనంగా ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి.

KALEEM, SIRICILLA
Published on: 6 Nov 2026 2:26 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో ఘనంగా జిల్లా స్థాయి యువజనోత్సవాలు-2026 ప్రారంభం!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలు–2026 కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి యువజనోత్సవాలు చక్కటి వేదికగా నిలుస్తాయని అన్నారు. చదువుతో పాటు క్రీడలు, చిత్రలేఖనం, గానం, నృత్యం వంటి కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో యువత పాల్గొనడం ద్వారా ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని పేర్కొన్నారు.

భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, ఆధునిక సమాజంలో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తమలోని నైపుణ్యాలను గుర్తించి క్రీడలు, కళల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. మానసిక వికాసంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ తమతమ రంగాల్లో రాణించి మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ దేశానికి గర్వకారణంగా మారాలని పిలుపునిచ్చారు.

అలాగే మన సంస్కృతి, సంప్రదాయాలు, కళలను కాపాడుకుంటూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత యువతపై ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి రాందాస్, కౌన్సిలర్ ఆడెపు చంద్రకళ ప్రభాకర్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, జిల్లా ఉపాధి కల్పన అధికారి నిర్మల, జీఎం ఇండస్ట్రీస్ ఎండీ హనుమంతరావు, యంగ్ ఇండస్ట్రీ నోడల్ ఆఫీసర్ దేవత ప్రభాకర్, ఉపాధ్యాయులు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA