Sircilla: సిరిసిల్ల పురపాలికలో రూ.78 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం!

Sircilla: రాజన్న సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో రూ.78 లక్షల అభివృద్ధి పనులు, ఓపెన్ జిమ్‌ను చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి శుక్రవారం ప్రారంభించారు.

KALEEM, SIRICILLA
Published on: 27 Nov 2026 5:40 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల పురపాలికలో రూ.78 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం!

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని 1వ వార్డులో ఉన్న రిసోర్స్ పార్కులో స్వచ్ఛ భారత్ మిషన్ (SBM) నిధులు రూ.73 లక్షలతో నూతన సీసీ రోడ్డు, వర్క్‌షెడ్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.

అదేవిధంగా 26వ వార్డులోని కొచ్చెరువు మినీ ట్యాంక్‌బండ్‌పై 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.5 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. సిరిసిల్లను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పాలకవర్గం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌కు సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖాదిర్ ఫాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు బూర బాలు, వేముల రాములు, బోల్గం వైష్ణవి నాగరాజు, మొగిలి నాగరాజు, ఎలుక వెంకటేశం, నెల్లుట్ల నరేష్, మాజీ కౌన్సిలర్ బోల్గం నాగరాజు, రక్కమల్లె సంపత్, మున్సిపల్ డీఈ వాణి, ఏఈ నరసింహస్వామి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA