Sircilla: సిరిసిల్లలో రెండో రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరుకుంది. సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట కార్మికుల ధర్నా.

KALEEM, SIRICILLA
Published on: 6 Nov 2026 2:33 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో రెండో రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరుకుంది. స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ కార్మికులు సమ్మెలో పాల్గొంటూ తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఉండగా మరణించిన, 60 ఏళ్లు పైబడి పదవీ విరమణ పొందిన కార్మికుల స్థానాల్లో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా కార్మికులపై పెరుగుతున్న పని భారాన్ని తగ్గించి, స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA