Sircilla: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు
Sircilla: రాజన్న సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన NAFSCOB చైర్మన్ కొండూరి రవీందర్ రావు.
Sircilla: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు
సిరిసిల్ల: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. NAFSCOB చైర్మన్ కొండూరి రవీందర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీఆర్‌ఎస్ సిరిసిల్ల పట్టణ శాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ సమగ్రత, ఐక్యతను కాపాడుతూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




