Sircilla: చంద్రంపేట జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో కౌన్సిలర్ మొగిలి నాగరాజు, ఏఎంసీ చైర్మన్ కంది సుజాత విద్యార్థులకు ఉచిత యూనిఫామ్‌లను పంపిణీ చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 15 Sept 2026 4:13 PM IST
Sircilla
X

Sircilla: చంద్రంపేట జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ!

సిరిసిల్ల: చంద్రంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక 12వ వార్డు కౌన్సిలర్ మొగిలి నాగరాజు, ఏఎంసీ చైర్మన్ కంది సుజాత, ప్రధానోపాధ్యాయులు కైరి పద్మ, బీనవేణి శ్రీకాంత్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు యూనిఫామ్‌లను అందజేసి, క్రమశిక్షణతో చదువుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA