Sircilla: 21వ రోజుకు చేరిన ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె!

Sircilla: సిరిసిల్లలో 21వ రోజుకు చేరిన ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె. నల్ల దుస్తులతో భారీ నిరసన ర్యాలీ. డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్.

KALEEM, SIRICILLA
Published on: 2 Nov 2026 1:24 PM IST
Sircilla
X

Sircilla: 21వ రోజుకు చేరిన ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె!

సిరిసిల్ల జిల్లా: సిరిసిల్లలో NHM ఉద్యోగుల నిరవధిక సమ్మె సోమవారం నాటికి 21వ రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ NHM ఉద్యోగులు నల్ల దుస్తులు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు.

పట్టణంలోని కొత్త బస్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా గాంధీ చౌక్‌కు చేరుకుని, నేతన్న విగ్రహం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.

తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు నిరవధిక సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు.

ఈ నిరసన ర్యాలీలో NHM ఉద్యోగులు స్రవంతి, లక్ష్మీ ప్రసన్న, నవీన్, ప్రియదర్శిని, సంతోష, మీరాయ, చందు, అంజలి, శ్వేత, వసంత, హేమ మంజుల, అనిత తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA