Sircilla: సిరిసిల్ల పద్మశాలి యువజన సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు!

Sircilla: పద్మశాలి యువజన సంఘం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 23న ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారి మామిడాల భూపతికి బాధ్యతలు అప్పగించారు.

KALEEM, SIRICILLA
Published on: 11 Aug 2026 10:10 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల పద్మశాలి యువజన సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు!

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పద్మశాలి యువజన సంఘం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. పద్మశాలి కుల పెద్దల సమక్షంలో యువజన సంఘం అధ్యక్షులు గుండ్లపెల్లి పూర్ణచందర్.. ఎన్నికల అధికారి మామిడాల భూపతికి ఎన్నికల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు.

వచ్చే ఆగస్టు 23వ తేదీ ఆదివారం రోజున పద్మశాలి యువజన సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా ఎన్నికల అధికారిని కోరారు. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారి మామిడాల భూపతి.. త్వరలోనే యువజన సంఘం తుది జాబితాతో పాటు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలి యువజన సంఘం ప్రధాన కార్యదర్శి గెంట్యాల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి వాసం శివశంకర్, సాంస్కృతిక కార్యదర్శి వేముల పూర్ణచంద్ర ప్రకాష్, పద్మశాలి సంఘం అధ్యక్షులు దూడం శంకర్, ప్రధాన కార్యదర్శి మండల సత్యం, పద్మశాలి మహిళా సంఘం అధ్యక్షురాలు కాముని వనిత, ప్రధాన కార్యదర్శి ఎనగందుల రూప, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు గాజుల బాలయ్య, ప్రధాన కార్యదర్శి దిడ్డి రాజు పాల్గొన్నారు.

అలాగే మాజీ అధ్యక్షులు గుండ్లపెల్లి శ్రీనివాస్, కట్టెకోల లక్ష్మీనారాయణ, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మినారాయణ, మాజీ రాష్ట్ర టెక్స్‌టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మాజీ సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడెపు రవీందర్, మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విఠల్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జిందం చక్రపాణి, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆడెపు భాస్కర్, సిరిసిల్ల మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఆడెపు చంద్రకళ ప్రభాకర్, తెలంగాణ పద్మశాలి మహిళా సంఘం కార్యదర్శి గుజ్జె తార, సహాయ కార్యదర్శి పత్తిపాక పద్మ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story