Sircilla: పానీపూరి తిని 39 మంది అస్వస్థత, బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్!

Sircilla: సిరిసిల్లలో పానీపూరి తిని 39 మంది అస్వస్థత! ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.

KALEEM, SIRICILLA
Published on: 19 Jun 2026 7:47 AM IST
Sircilla
X

Sircilla: పానీపూరి తిని 39 మంది అస్వస్థత, బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్!

Sircilla: జిల్లాలో పానీపూరి తిని అస్వస్థతకు గురైన పిల్లలు, పెద్దలను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరామర్శించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితులకు పండ్లు పంపిణీ చేసి ధైర్యం చెప్పారు.

తంగళ్ళపల్లి మండలం మండేపల్లి పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో పానీపూరి తిని దాదాపు 30 మంది పిల్లలు, 9 మంది పెద్దలు అస్వస్థతకు గురయ్యారు. వీరంతా జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, గురువారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి వారిని పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటికే 8 మంది డిశ్చార్జ్ కాగా, మిగతా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆది శ్రీనివాస్, బాధితుల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం ఆరా తీస్తున్నారని తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని చెప్పారు. పానీపూరి విక్రయించి పలువురు అస్వస్థతకు గురికావడానికి కారణమైన నిర్వాహకుడిపై ఇప్పటికే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

వర్షాకాలం నేపథ్యంలో జిల్లాలోని అన్ని ఆహార విక్రయ కేంద్రాలపై ఫుడ్ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ప్రజలు వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, శుభ్రమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సూచించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story