Sircilla: జాతీయ బాడీబిల్డింగ్ పోటీల్లో సత్తా చాటిన సిరిసిల్ల యువకుడు

Sircilla: గోవాలో జరిగిన ఐసిఎన్ జాతీయ నేచురల్ బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రతిభ చాటిన సిరిసిల్లకు చెందిన పట్టాభి గణేష్ పటేల్. ప్రభుత్వ ప్రోత్సాహం కోరిన క్రీడాకారుడు.

KALEEM, SIRICILLA
Published on: 6 Nov 2026 10:20 PM IST
Sircilla
X

Sircilla: జాతీయ బాడీబిల్డింగ్ పోటీల్లో సత్తా చాటిన సిరిసిల్ల యువకుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణం సుభాష్ నగర్‌కు చెందిన పట్టాభి గణేష్ పటేల్ జాతీయ స్థాయి నేచురల్ బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రతిభ చాటాడు. గోవాలో నిర్వహించిన ICN GOA-2026 పోటీల్లో రెండు విభాగాల్లో పాల్గొని ఒక విభాగంలో మూడో స్థానం, మరో విభాగంలో ఐదో స్థానం సాధించి సత్తా చాటాడు.

గత మూడేళ్లుగా క్రమశిక్షణతో కూడిన సాధన, కఠోర శ్రమతో బాడీ బిల్డింగ్‌పై దృష్టి సారించిన గణేష్ ఈ విజయాన్ని అందుకున్నాడు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మెరుగైన ర్యాంకులు సాధించడమే తన లక్ష్యమని తెలిపాడు.

ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తే మరింత మెరుగ్గా రాణించి జిల్లాతో పాటు రాష్ట్రానికి పేరు తీసుకొస్తానని గణేష్ పేర్కొన్నాడు. తల్లిదండ్రులు పట్టాభి శ్రీనివాస్, లత ప్రోత్సాహంతో బాడీ బిల్డింగ్‌లో ముందుకు సాగుతున్న గణేష్ విజయంపై పలువురు అభినందనలు తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA