Sircilla: సిరిసిల్ల పెద్దూరు మహాలక్ష్మి ఫర్నిచర్‌లో భారీ అగ్నిప్రమాదం!
Sircilla: సిరిసిల్ల పెద్దూరు ప్రధాన రహదారిలోని మహాలక్ష్మి ఫర్నిచర్‌లో భారీ అగ్నిప్రమాదం. రూ.35 లక్షల ఆస్తి నష్టం, పరిశీలించిన డీఎస్పీ నాగేంద్ర చారి.
Sircilla: సిరిసిల్ల పెద్దూరు మహాలక్ష్మి ఫర్నిచర్‌లో భారీ అగ్నిప్రమాదం!
Sircilla: సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూరు ప్రధాన రహదారిపై ఉన్న మహాలక్ష్మి ఫర్నిచర్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో షోరూంలోని ఫర్నిచర్ భారీగా దగ్ధమైంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని సుమారు రెండు గంటలుగా మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. మూడు ఫైర్ యంత్రాలు సరిపోకపోవడంతో పక్కనే ఉన్న గుంతలోని నీటిని వినియోగిస్తూ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ మంటలు పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో సహాయక చర్యలు కొనసాగాయి.
అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న డీఎస్పీ కత్రోజు నాగేంద్ర చారి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ఈ ప్రమాదంలో సుమారు రూ.35 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.




