Sircilla: రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

Sircilla: అక్టోబర్ 21న రాజన్న సిరిసిల్ల జిల్లా లింగంపేట అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించనున్న కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితే.

KALEEM, SIRICILLA
Published on: 20 Oct 2026 5:35 PM IST
Sircilla
X

Sircilla: రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

సిరిసిల్ల: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా అక్టోబర్ 21న (బుధవారం) రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులోని పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించనున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్‌ అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు.

ఈ కార్యక్రమానికి పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు హాజరుకానున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA