Sircilla: సిరిసిల్లలో పోలీసుల సోదాలు.. రంగంలోకి నార్కోటిక్ డాగ్స్!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా నార్కోటిక్ జాగిలాలతో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

KALEEM, SIRICILLA
Published on: 25 Jun 2026 3:47 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో పోలీసుల సోదాలు.. రంగంలోకి నార్కోటిక్ డాగ్స్!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనపై పోలీసులు మరింత దృష్టి సారించారు. యాంటీ-డ్రగ్ అవేర్‌నెస్ వీక్‌లో భాగంగా సిరిసిల్ల పట్టణంలో నార్కోటిక్ జాగిలాల సహాయంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. గంజాయి సరఫరా, వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీలు

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణంలోని కిరాణా దుకాణాలు, పాన్ షాప్‌లు, బస్టాండ్‌లు, విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో పోలీసులు నార్కోటిక్ డాగ్‌ల సహాయంతో తనిఖీలు చేపట్టారు.

గంజాయి, ఇతర మాదకద్రవ్యాల సరఫరా మరియు వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు అమలు చేస్తోందని అధికారులు తెలిపారు. ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో తరచూ తనిఖీలు నిర్వహిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని, వాటి దుష్పరిణామాలపై విద్యార్థులు, యువత, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు యాంటీ-డ్రగ్ అవేర్‌నెస్ వీక్ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

డ్రగ్స్, గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్‌లైన్ 8712671111 లేదా సమీప పోలీస్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అధికారులు స్పష్టం చేశారు.

మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల సహకారం ఎంతో కీలకమని పోలీసులు పేర్కొంటూ, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story