Sircilla: రోడ్లపై 'ప్రజా పాలన' కేక.. డ్రగ్స్ రహిత లక్ష్యం వైపు అడుగులు

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ 2కే రన్ నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Updated on: 2 May 2026 11:09 AM IST
Sircilla
X

Sircilla: రోడ్లపై 'ప్రజా పాలన' కేక.. డ్రగ్స్ రహిత లక్ష్యం వైపు అడుగులు

రాజన్న సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా సిరిసిల్లలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. అంబేద్కర్ చౌక్ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు ఈ రన్ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, పోలీస్ అధికారులు, పట్టణంలోని పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో అరైవ్ అలైవ్, డ్రగ్స్ రహిత తెలంగాణ కార్యక్రమాలు పోలీసు శాఖకు అత్యంత ప్రాధాన్యత కలిగినవని తెలిపారు. ఈ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృతంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

డ్రగ్స్ రహిత తెలంగాణలో భాగంగా జిల్లా ప్రధాన ఆసుపత్రిలో డీ-అడిక్షన్ సెంటర్ ప్రారంభించామని, ఇప్పటికే దాదాపు 10 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. మత్తు పదార్థాల వినియోగం సమాజానికి హానికరమని, వాటిని పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మత్తు పదార్థాలు సేవించే లేదా విక్రయించే వారి వివరాలను పోలీసులకు అందించి నియంత్రణలో భాగస్వాములు కావాలని ప్రజలను కోరారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story