Sircilla: సంపూర్ణ గోహత్య నిషేధానికి చట్టం తేవాలి

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ సంతకాల సేకరణను జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ప్రారంభించారు.

KALEEM, SIRICILLA
Published on: 28 Nov 2026 11:41 PM IST
Sircilla
X

Sircilla: సంపూర్ణ గోహత్య నిషేధానికి చట్టం తేవాలి

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ధార్మిక సెల్ ఆదేశాల మేరకు జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్ డాక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో “గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ప్రజల నుంచి మద్దతు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సంపూర్ణ గోహత్య నిషేధం అమలు చేయాలని, గోమాతకు జాతీయ గౌరవం కల్పించాలని కోరారు. గోరక్షణ, గోసేవ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రజల మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు.

గోమాత సంరక్షణ, గోరక్షణ, గోసేవ పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ అభియాన్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి సంతకాలు సేకరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పొన్నాల తిరుపతిరెడ్డి, సిరికొండ శ్రీనివాస్, ధార్మిక సెల్ జిల్లా కో-కన్వీనర్ గొట్టే రామచంద్రం, గంభీరావుపేట మండల అధ్యక్షుడు కోడె రమేష్, సిరిసిల్ల ధార్మిక సెల్ అధ్యక్షుడు గాలి శ్రీనివాస్, కో-కన్వీనర్ ఎం. వేముల పోశెట్టి, వేములవాడ అర్బన్ ధార్మిక సెల్ కన్వీనర్ పేరగాని మల్లేశం, కో-కన్వీనర్ మాంజేటి రాంబాబు, గంభీరావుపేట ధార్మిక సెల్ కన్వీనర్ రుద్రోజు శ్రీనివాస్, ధార్మిక సెల్ నాయకులు కనుకొండ్ల రవి, దూస రామనారాయణ, వెంగళ అంకయ్య తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA