Sircilla: నామినేటెడ్ పదవులు రెడ్లకే కేటాయించాలి: గుండారపు కృష్ణారెడ్డి
Sircilla: జనరల్ కేటగిరీ నామినేటెడ్ పదవులను రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
Sircilla: నామినేటెడ్ పదవులు రెడ్లకే కేటాయించాలి: గుండారపు కృష్ణారెడ్డి
సిరిసిల్ల: ప్రభుత్వం వివిధ రంగాల్లో నియమించే జనరల్ కేటగిరీ నామినేటెడ్ పదవులను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
జిల్లాలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రెడ్డిల పట్ల చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో రెడ్డి సామాజిక వర్గానికి అన్యాయం జరగకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. రెడ్డిలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
జనరల్ కేటగిరీ కింద భర్తీ చేసే నామినేటెడ్ పదవులను సరైన విధంగా కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమావేశంలో రెడ్డి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఎగుమామిడి కృష్ణారెడ్డి, మడుపు ప్రమోదరెడ్డి, సంయుక్త కార్యదర్శి దుండ్రా జలజారెడ్డి, కోశాధికారి ఎడ్మల హనుమంతరెడ్డి, ఈసీ సభ్యులు కంది భాస్కర్‌రెడ్డి, మడుపు ప్రేమ్‌సాగర్‌రెడ్డితో పాటు పలువురు రెడ్డి కుల నాయకులు పాల్గొన్నారు.




