Sircilla: విదేశీ విద్యకు మైనారిటీ విద్యార్థులకు రూ.20 లక్షల స్కాలర్‌షిప్

Sircilla: ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కింద విదేశీ విద్యకు మైనారిటీ విద్యార్థులకు రూ.20 లక్షల సాయం; డిసెంబర్ 1 నుంచి ఈ-పాస్‌లో దరఖాస్తులకు ఆహ్వానం.

KALEEM, SIRICILLA
Published on: 28 Nov 2026 6:27 PM IST
Sircilla
X

Sircilla: విదేశీ విద్యకు మైనారిటీ విద్యార్థులకు రూ.20 లక్షల స్కాలర్‌షిప్

రాజన్న సిరిసిల్ల జిల్లా: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే మైనారిటీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందిన అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి గొట్టే జయశ్రీ తెలిపారు.

2026 జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఫాల్ సీజన్‌లో అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన మైనారిటీ విద్యార్థులు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు.

డిసెంబర్ 1 నుంచి దరఖాస్తులు

అర్హులైన విద్యార్థులు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31, 2026 సాయంత్రం 5 గంటల వరకు "తెలంగాణ ఈ-పాస్ వెబ్‌సైట్" (https://telanganaepass.cgg.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తు హార్డ్ కాపీతో పాటు అవసరమైన ధ్రువపత్రాలను 2027 జనవరి 31 సాయంత్రం 5 గంటలలోపు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.

రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం

ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు రూ.20 లక్షల ఉపకార వేతనంతో పాటు వన్‌వే విమాన ప్రయాణ ఛార్జీ కింద రూ.60 వేల వరకు లేదా వాస్తవ విమాన ఛార్జీ, ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని అందించనున్నట్లు వెల్లడించారు.

విద్యార్థుల వయస్సు, విద్యార్హతలు, వార్షిక కుటుంబ ఆదాయం తదితర అర్హతలు, నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ-పాస్ వెబ్‌సైట్‌లో పరిశీలించాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలనలో నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినట్లు తేలితే సంబంధిత అభ్యర్థులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంప్రదించాల్సిన చిరునామా: జిల్లా అధికారి, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయం, రూం నంబర్ F26, మొదటి అంతస్తు, కలెక్టరేట్ కాంప్లెక్స్, రాజన్న సిరిసిల్ల.

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 9949910328.ఈ అవకాశాన్ని అర్హులైన మైనారిటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి గొట్టే జయశ్రీ కోరారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA