Sircilla: సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు
Sircilla: సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో 11 డిపోల డ్రైవర్లు, యజమానులతో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం. పాల్గొన్న అధికారులు, డీటీఓ శ్రీనివాస్ రావు.
Sircilla: సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు
సిరిసిల్ల: సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డిపోతో పాటు మొత్తం 11 డిపోల డ్రైవర్లు, హైర్ బస్సుల యజమానులు, హైర్ బస్ డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
స్లైడ్ల ద్వారా రోడ్డు ప్రమాదాలకు దారితీసే ప్రధాన కారణాలు, ప్రమాదాలు జరిగే విధానం, వాటి వల్ల కలిగే నష్టాలు, ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వాహనం నడిపే ముందు పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని, అతివేగాన్ని నివారించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించరాదని సూచించారు.
అలాగే ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అలసట లేదా నిద్రమత్తుతో వాహనం నడపకూడదని, ముఖ్యంగా వర్షాకాలంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రయాణికుల ప్రాణాల రక్షణే ప్రతి డ్రైవర్ ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ, సురక్షిత డ్రైవింగ్‌తోనే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీటీఓ శ్రీనివాస్ రావు, డిప్యూటీ ఆర్ఎంలు భూపతి రెడ్డి, మల్లేశం, ఎంవీఐ వంశీధర్, ఏఎంవీఐలు పృథ్వీరాజ్ వర్మ (సిరిసిల్ల), సాగర్ (కరీంనగర్), నిఖిల్ (పెద్దపల్లి), డీఎం సిరిసిల్ల ప్రకాశ్ రావు, డీఎం వేములవాడ శ్రీనివాస్ పాల్గొన్నారు.




