Sircilla: సిరిసిల్లలో శబరిమల అయ్యప్ప స్వామి నమూనా ఆలయం ప్రారంభం

Sircilla: సిరిసిల్లలో శబరిమల అయ్యప్ప స్వామి నమూనా ఆలయం ప్రారంభం. మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, డీఎస్పీ నాగేంద్ర చారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం.

KALEEM, SIRICILLA
Published on: 21 Sept 2026 10:21 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో శబరిమల అయ్యప్ప స్వామి నమూనా ఆలయం ప్రారంభం

సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని స్థానిక 3వ వార్డు గీతానగర్–విద్యానగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక మండపం ఆవరణలో శ్రీశ్రీ శబరిమల అయ్యప్ప స్వామి వారి నమూనా ఆలయాన్ని నిర్మించారు. కేరళలోని శబరిమల ఆలయాన్ని పోలిన విధంగా ఈ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి గౌరవ సాగర్ గురు స్వామి, సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య అతిథులు భక్తుల సందర్శనార్థం శ్రీశ్రీ శబరిమల అయ్యప్ప స్వామి వారి నమూనా ఆలయాన్ని ప్రారంభించారు.

నమూనా ఆలయాన్ని భక్తులు సందర్శించి అయ్యప్ప స్వామి వారిని దర్శించుకునేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో గీతానగర్–విద్యానగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA