Sircilla: పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన: కలెక్టరేట్ ముట్టడికి యత్నం!

Sircilla: సిరిసిల్లలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు జీవో 97 రద్దు, వసతుల సాధనకై కలెక్టరేట్ ఎదుట తీవ్ర నిరసనలు చేపట్టారు.

KALEEM, SIRICILLA
Published on: 20 Aug 2026 1:16 PM IST
Sircilla
X

Sircilla: పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన: కలెక్టరేట్ ముట్టడికి యత్నం!

Sircilla: రాజన్న సిరిసిల్లలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. శక్తి స్కీమ్‌ను రద్దు చేయడంతో పాటు జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు.

పాలిటెక్నిక్ కళాశాల నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి, కలెక్టరేట్ గేటు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.

కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు.

ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించి పాలిటెక్నిక్ విద్యను కాపాడాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్‌కు వినతిపత్రం అందజేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story