Sircilla: మహిళా భద్రతపై విద్యాసంస్థలు, పని ప్రదేశాల్లో షీ టీమ్ విస్తృత అవగాహన సదస్సులు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో చందుర్తి మండల పాఠశాలల్లో మహిళా భద్రత, సైబర్ నేరాలు, పోక్సో చట్టాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

BABU, VEMULAWADA
Published on: 5 Nov 2026 10:59 PM IST
Sircilla
X

Sircilla: మహిళా భద్రతపై విద్యాసంస్థలు, పని ప్రదేశాల్లో షీ టీమ్ విస్తృత అవగాహన సదస్సులు!

రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే గారి సూచనల మేరకు జిల్లా షీ టీమ్ ప్రతి రోజూ విద్యాసంస్థలు, మహిళలు పని చేసే ప్రదేశాలను సందర్శిస్తూ గుడ్ టచ్ / బ్యాడ్ టచ్, ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో చట్టం, Cyber crime ,(1930 ), Emergency Response Support System (ERSS) 112 , మరియు T - SAFE, షీ టీమ్ సేవలు, మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా షీ టీమ్ బృందం ఈరోజు. చందుర్తి మండలం, మర్రిగడ్డ గ్రామంలో ని ZPHS, MPPS, మూడపల్లి గ్రామంలోని ZPHS, MPPS లను సందర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించి, వేధింపులకు గురైతే నిర్భయంగా షీ టీమ్l నెంబర్ 87126 56425 కు ఫిర్యాదు చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని సూచించారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులకు స్పందించకూడదని,గుర్తు తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవొద్దని తెలిపారు.

ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఏఎస్‌ఐ ప్రమీల, రవి. సిబ్బంది , శ్రీలత, శ్రీనివాస్‌తో పాటు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA