Chandurthi: మహిళ భద్రతపై విద్యాసంస్థల్లో ప్రత్యేక అవగాహన: షీ టీమ్
Chandurthi: రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి. గితే సూచనలతో చందుర్తి మండలంలోని 5 పాఠశాలల్లో షీ టీమ్ బృందం మహిళా భద్రత, సైబర్ క్రైమ్, పోక్సో చట్టాలపై అవగాహన కల్పించింది.
Chandurthi: మహిళ భద్రతపై విద్యాసంస్థల్లో ప్రత్యేక అవగాహన: షీ టీమ్
రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే గారి సూచనల మేరకు జిల్లా షీ టీమ్ ప్రతి రోజూ విద్యాసంస్థలు, మహిళలు పని చేసే ప్రదేశాలను సందర్శిస్తూ గుడ్ టచ్ / బ్యాడ్ టచ్, ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో చట్టం, Cyber crime ,(1930 ), Emergency Response Support System (ERSS) 112 , మరియు T - SAFE, షీ టీమ్ సేవలు, మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా షీ టీమ్ బృందం ఈరోజు చందుర్తి మండలం, నర్సింగాపూర్ గ్రామంలో ని ZPHS, MPPS, అసిరెడ్డిపల్లి గ్రామంలోని MPUPS , తిమ్మాపూర్ గ్రామంలోని MPPS, రామన్నపేట గ్రామంలోని MPUPS లను సందర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించి, వేధింపులకు గురైతే నిర్భయంగా షీ టీమ్l నెంబర్ 87126 56425 కు ఫిర్యాదు చేయాలి.
నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని , ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని సూచించారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులకు స్పందించకూడదని,గుర్తు తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవొద్దని తెలిపారు.
ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఏఎస్ఐ ప్రమీల, రవి. సిబ్బంది ప్రియాంక, శ్రీలత, శ్రీనివాస్‌తో పాటు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.




