Sircilla: ఇప్పళ్లపల్లి పాఠశాలలో విద్యార్థులకు షూల పంపిణీ
Sircilla: సిరిసిల్ల పట్టణం 8వ వార్డు ఇప్పళ్లపల్లి పాఠశాలలో విద్యార్థులకు షూలు పంపిణీ చేసిన కౌన్సిలర్ భాగ్యలక్ష్మి సత్యనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ జిల కిషన్ యాదవ్.
Sircilla: ఇప్పళ్లపల్లి పాఠశాలలో విద్యార్థులకు షూల పంపిణీ
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని 8వ వార్డు ఇప్పళ్లపల్లి పాఠశాలలో విద్యార్థులకు షూలు పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుప్రజ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ లింగంపల్లి భాగ్యలక్ష్మి సత్యనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ జిల కిషన్ యాదవ్ విద్యార్థులకు షూలను అందజేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ లింగంపల్లి భాగ్యలక్ష్మి సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.




