Sircilla: అన్నపూర్ణ ప్రాజెక్ట్ పంప్ హౌస్‌లను ప్రారంభించాలి సిద్ధం వేణు
Sircilla: సిరిసిల్ల జిల్లా అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టు పంప్ హౌస్‌లను వెంటనే ప్రారంభించాలని మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు డిమాండ్.
Sircilla: అన్నపూర్ణ ప్రాజెక్ట్ పంప్ హౌస్‌లను ప్రారంభించాలి సిద్ధం వేణు
సిరిసిల్ల: శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి ఎల్‌ఎండీకి నీటిని విడుదల చేసిన సందర్భంగా పొత్తూరు బ్రిడ్జి వద్ద గోదారమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టు పంప్ హౌస్‌లను వెంటనే ప్రారంభించి జలాశయాన్ని నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎల్లంపల్లి నుంచి శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి ఎత్తిపోతలు ప్రారంభించి, నందిమేడారం–లక్ష్మిపూర్ పంప్ హౌస్‌ల ద్వారా ఎల్‌ఎండీకి నీటిని విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై గతంలో చేసిన విమర్శలు వాస్తవాలకు విరుద్ధమని పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, బెజ్జంకి, గన్నేరువరం మండలాల రైతులకు సాగు, తాగునీరు అందించాలంటే అనంతగిరి అన్నపూర్ణ జలాశయాన్ని వెంటనే నింపాలని, అనంతారం, తోటపల్లి ప్రాజెక్టులకు కూడా నీటిని విడుదల చేయాలని స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను కోరారు.
అన్నపూర్ణ జలాశయాన్ని నింపడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి అన్నపూర్ణ జలాశయం వరకు రైతులతో కలిసి భారీ పాదయాత్ర చేపడతామని సిద్ధం వేణు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పట్నం అశ్విని శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్, ఉపసర్పంచ్ బండారి నరేష్ గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.




