Sircilla: ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత సమాజం.. ఎస్పీ మహేష్
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం తడూర్ గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ. భద్రత, గంజాయి నిర్మూలనపై అవగాహన కల్పించిన ఎస్పీ మహేష్.
Sircilla: ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత సమాజం.. ఎస్పీ మహేష్
Sircilla: జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యమని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. తంగ్గళ్ళపల్లి మండలం తడూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న ఎస్పీ రోడ్డు భద్రతా నియమాల పాటింపు, మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో ఎస్పీ మహేష్ బి. గితే పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపొద్దని సూచించారు. గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీలు బ్లాక్ స్పాట్స్ గుర్తించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కోరారు. మహిళలు షీ టీమ్ సేవలను వినియోగించుకోవాలని, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన ఎస్పీ.




