Sircilla: సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్ర వేడుకలు
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీ మహేష్ బి. గితే. పాల్గొన్న పోలీసు అధికారులు.
Sircilla: సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్ర వేడుకలు
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. వారి త్యాగాల స్ఫూర్తితో దేశ సమగ్రత, ఐక్యతతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత, చట్టబద్ధ పాలనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు. ప్రజలకు స్నేహపూర్వకమైన, పారదర్శకమైన, సాంకేతికత ఆధారిత పోలీసింగ్ సేవలను అందించడమే ప్రతి పోలీస్ అధికారి బాధ్యత అని తెలిపారు.
ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సీఐలు, ఆర్‌ఐలు, ఏఓ, ఎస్‌ఐలు, పోలీస్ కార్యాలయ సిబ్బంది, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




