Sircilla: సిరిసిల్ల పోలీస్ ఆర్‌ఐ స్టోర్స్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ స్టోర్స్‌ను తనిఖీ చేసిన ఎస్పీ మహేష్ బి. గితే. రికార్డులను పక్కాగా నిర్వహించాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఆదేశం.
Sircilla: సిరిసిల్ల పోలీస్ ఆర్‌ఐ స్టోర్స్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని ఆర్‌ఐ స్టోర్స్ విభాగాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్స్‌లో సామగ్రి నిల్వలు, వాటి సంరక్షణ, పోలీస్ స్టేషన్లకు పంపిణీ విధానాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ క్రమబద్ధంగా నిర్వహించాలని, అవసరమైన సామగ్రి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే స్టోర్స్ పరిసరాల్లో పరిశుభ్రత పాటిస్తూ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని సూచించారు.
ఈ తనిఖీలో ఆర్‌ఐలు మధుకర్, సురేష్, రమేష్, ఎస్‌ఐ రాజుతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




