Sircilla: బక్రీద్ వేళ హై అలర్ట్.. పశువుల అక్రమ రవాణాపై ఎస్పీ సీరియస్
Sircilla: సిరిసిల్ల జిల్లాలో బక్రీద్ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్పీ మహేష్ బి. గీతే ఆదేశాలు.
Sircilla: బక్రీద్ వేళ హై అలర్ట్.. పశువుల అక్రమ రవాణాపై ఎస్పీ సీరియస్
Sircilla: రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలు,సామరస్య వాతావరణం కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే హిందు సంఘాల ప్రతినిధులకు పిలుపునిచ్చారు.
గురువారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో హిందు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా సరిహద్దుల్లో మూడు చెక్ పోస్ట్ లు ఏర్పాటుతో పాటుగా ప్రతి స్టేషన్ పరిధిలో 24/7 వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాడం జరిగిందన్నారు.
పశువుల రవాణాపై 1977 నాటి గోవధ నిరోధక చట్టం, 1978 నాటి ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ యానిమల్స్ రూల్స్, 1960 నాటి ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ చట్టాలను కచ్చితంగా అమలు చేయాడం జరుగుతుదన్నారు. పశువుల రవాణా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని, పశువుల రవాణాపై అనుమానాల పేరుతో రోడ్ల దిగ్బంధనలు , ఘర్షణాత్మక పరిస్థితులు సృష్టించవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు అవసరమైతే రౌడీ,సస్పెక్ట్ షీట్లు కూడా తెరవబడతాయని స్పష్టం చేశారు.గత సంవత్సరం రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని ఈసందర్భంగా గుర్తు చేశారు.
పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్ 8712537826 కి లేదా నోడల్ అధికారి స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ 87126 56410 కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని,పశువులను అక్రమంగా తరలించే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి రాజీ ఉండదని ఎస్పీ స్పష్టం చేశారు.
సీజ్ చేసిన పశువుల కోసం జిల్లాలో 09 ఆశ్రయ కేంద్రాలు ఉన్నాయని,ఆశ్రయా కేంద్రాల వద్ద వెటర్నరీ డాక్టర్ తో పాటుగా మేత, నీరు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈసమావేశంలో డిఎస్పీ లు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సి.ఐ రవి, ఎస్.ఐ శ్రీకాంత్ హిందూ సంఘాలు ప్రతినిధులు పాల్గొన్నారు.




