Sircilla: వీర్నపల్లి పిఎస్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వీర్నపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంజాయి, చోరీలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశం.
Sircilla: వీర్నపల్లి పిఎస్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పనితీరు, నమోదైన కేసులు, పెండింగ్ దర్యాప్తులు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, పెట్రోలింగ్ వ్యవస్థపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిరంతర నిఘా కొనసాగించాలని, ఆస్తి నేరాలు, చోరీలు, గంజాయి అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత బలోపేతం చేసి విజిబుల్ పోలీసింగ్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
గ్రామాల్లో తరచూ పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజల విశ్వాసాన్ని పెంచేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అధికారులకు ఎస్పీ దిశానిర్దేశం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేష్, ఎస్ఐ లక్ష్మణ్ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.




