సిరిసిల్లలో పోలీసుల ‘అరైవ్-అలైవ్’ ర్యాలీ.. హెల్మెట్లు పంపిణీ చేసిన ఎస్పీ మహేష్ బిగితే!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పోలీసులు ‘అరైవ్-అలైవ్’ అవగాహన ర్యాలీ చేపట్టారు.

KALEEM, SIRICILLA
Published on: 10 Jun 2026 4:02 PM IST
సిరిసిల్లలో పోలీసుల ‘అరైవ్-అలైవ్’ ర్యాలీ.. హెల్మెట్లు పంపిణీ చేసిన ఎస్పీ మహేష్ బిగితే!
X

సిరిసిల్లలో పోలీసుల ‘అరైవ్-అలైవ్’ ర్యాలీ.. హెల్మెట్లు పంపిణీ చేసిన ఎస్పీ మహేష్ బిగితే!

సిరిసిల్ల: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ నుండి బతుకమ్మ ఘాట్ వరకు విద్యార్థిని మరియు విద్యార్థులు క్రీడాకారులతో కలిసి సిరిసిల్ల పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్-అలైవ్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే పాల్గొని విద్యార్థులకు ముఖ్య సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... రోడ్డు భద్రత, డ్రగ్స్ నిర్మూలన పిల్లల భద్రత పై ప్రతిరోజు స్కూల్లో కాలేజీలలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఈరోజు కూడా 300 మంది విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించామని సిరిసిల్ల జిల్లాలో ప్రమాదాలు జరిగే టర్నింగ్ పాయింట్లను గుర్తించామని, రోడ్డు ప్రమాదాలకు కారణాలు చాలా ఉన్నాయని కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా ఎక్కువ శాతం ప్రమాదం జరిగే అవకాశం ఉందని గత నాలుగు ఐదు నెలల నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ పై మరియు రోడ్డు భద్రతపై అనేక రకాల కార్యక్రమాలు చేపట్టమని దాని ద్వారా ప్రజల్లో కూడా అవగాహన ఏర్పడి చైతన్యం వచ్చిందని గతంతో పోల్చుకుంటే ప్రమాదల శాతం తగ్గిందని ఎస్పీ తెలిపారు.

జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ వాహనదారులు ముందుకు వెళ్లాలని రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా ప్రజలు క్షేమంగా వెళ్లి క్షేమంగా ఇంటికి రావాలనేదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. అనంతరం ఎస్పీ మరియు జిల్లా రవాణా శాఖ అధికారి కలిసి ప్రజలకు హెల్మెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్పీ మరియు రవాణాశాఖ అధికారులతో పాటు సిరిసిల్ల డిఎస్పి పట్టణ సిఐలు మిగతా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story