Sircilla: రాజన్న సిరిసిల్ల పోలీస్ గ్రీవెన్స్‌డేలో 13 ఫిర్యాదుల స్వీకరణ
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ గ్రీవెన్స్ డేలో 13 ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ. బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులకు కీలక ఆదేశాలు.
Sircilla: రాజన్న సిరిసిల్ల పోలీస్ గ్రీవెన్స్‌డేలో 13 ఫిర్యాదుల స్వీకరణ
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ప్రజల నుంచి 13 ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, బాధితుల సమస్యలను చట్ట ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, బాధితుల సమస్యలను పరిష్కరించి సత్వర న్యాయం అందించడమే గ్రీవెన్స్ డే లక్ష్యమని తెలిపారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి ఫిర్యాదులను స్వీకరించాలని సూచించారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చూడాలన్నారు.
గ్రీవెన్స్ డేలో అందిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, వాటి పరిష్కారంపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, పోలీస్ శాఖ అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.




