Sircilla: సిరిసిల్ల లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఇనాం భూములకు నవంబర్ 12న వేలం
Sircilla: రాజన్న సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఇనాం భూములను రెండేళ్ల కౌలుకు ఇచ్చేందుకు నవంబర్ 12న బహిరంగ వేలం నిర్వహించనున్నారు.
Sircilla: సిరిసిల్ల లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఇనాం భూములకు నవంబర్ 12న వేలం
రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణం, మండల పరిధిలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన ఇనాం భూములను కౌలుకు ఇచ్చేందుకు సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ప్రకటన విడుదల చేశారు.
దేవస్థానానికి చెందిన భూములను రెండేళ్ల కాలానికి, అంటే 2026 డిసెంబర్ 1 నుంచి 2028 నవంబర్ 30 వరకు కౌలుకు ఇవ్వనున్నారు. నవంబర్ 12వ తేదీ ఉదయం 11:30 గంటలకు సిరిసిల్లలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద వేలం నిర్వహించనున్నారు.
భూమి వివరాలు:
సర్వే నంబర్లు 263, 264లో ఉన్న ఎకరా 2.03 గుంటల తరి భూమిని కౌలుకు ఇవ్వనున్నారు. ఈ భూమి శాంతినగర్ రోడ్ సమీపంలో ఉంది. వేలంలో పాల్గొనాలనుకునే ఆసక్తి గల వారు రూ.5,000 ధరావత్తు చెల్లించి పాల్గొనవచ్చని దేవస్థానం అధికారులు వెల్లడించారు.




