Sircilla: సిరిసిల్ల సెకండ్ హ్యాండ్ మొబైల్స్‌పై పోలీసుల నిఘా

Sircilla: సిరిసిల్లలో సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లపై కఠిన నిఘా. విక్రయించే వ్యక్తి ఆధార్ వివరాలు తప్పనిసరి. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవన్న ఎస్పీ మహేష్.

KALEEM, SIRICILLA
Published on: 18 July 2026 3:14 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల సెకండ్ హ్యాండ్ మొబైల్స్‌పై పోలీసుల నిఘా

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెకండ్‌హ్యాండ్ మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై జిల్లా పోలీసులు కఠిన నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్, మొబైల్ రిపేర్ షాపుల యజమానులతో సమావేశమైన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే కీలక సూచనలు చేశారు.

సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొనుగోలు లేదా ఎక్స్చేంజ్ చేసే సమయంలో విక్రయించే వ్యక్తి ఆధార్ కార్డుతో పాటు పూర్తి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని షాప్ యజమానులను ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు మొబైల్ విక్రయానికి వచ్చినా లేదా దొంగిలించిన మొబైల్ అని అనుమానం వచ్చినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.

మొబైల్ దొంగలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించే షాప్ యజమానులను ప్రశంసాపత్రాలతో సత్కరిస్తామని ఎస్పీ తెలిపారు. అలాగే తక్కువ ధరకు వస్తుందని దొంగిలించిన మొబైల్ ఫోన్లు కొనుగోలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మొబైల్ విక్రయించాలనుకునే వారు అధికారిక విక్రయ కేంద్రాలు లేదా కంపెనీ ఎక్స్చేంజ్ స్టోర్ల ద్వారానే విక్రయించాలని, అనధికారిక వ్యక్తులకు అమ్మొద్దని సూచించారు. దొంగిలించిన మొబైల్ ఫోన్లు సైబర్ నేరాలకు ఉపయోగించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పేర్కొన్నారు.

ప్రజల సహకారంతోనే మొబైల్ రికవరీలో దక్షిణ భారతదేశంలో మొదటి స్థానం, తెలంగాణ రాష్ట్రంలో వరుసగా మూడో ఏడాది తొలి స్థానం సాధించామని తెలిపారు. మొబైల్ పోయినా లేదా దొంగిలించబడినా వెంటనే CEIR పోర్టల్‌లో బ్లాక్ చేసి, సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ మహేష్ బి. గితే ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story