Sircilla: రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు సిరిసిల్ల విద్యార్థి ప్రతీక్ నందన్ ఎంపిక!
Sircilla: రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు సిరిసిల్ల ఇంగ్లీష్ యూనియన్ హైస్కూల్ విద్యార్థి దూస ప్రతీక్ నందన్ ఎంపికయ్యాడు. కరస్పాండెంట్ రాజ్ కుమార్ అభినందించారు.
Sircilla: రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు సిరిసిల్ల విద్యార్థి ప్రతీక్ నందన్ ఎంపిక!
రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణంలోని ఇంగ్లీష్ యూనియన్ హైస్కూల్ విద్యార్థి దూస ప్రతీక్ నందన్ రాష్ట్రస్థాయి ఆర్చరీ (విలువిద్య) పోటీలకు ఎంపికయ్యాడు. జీయర్ గురుకులం, అల్లంపల్లి వేదికగా నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతీక్ నందన్ పాల్గొననున్నాడు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రాజ్ కుమార్ విద్యార్థి ప్రతీక్ నందన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపారు.




