Sircilla: చంద్రంపేట సబ్‌స్టేషన్‌లో నూతన బ్రేకర్ ప్రారంభం!
Sircilla: సిరిసిల్ల చంద్రంపేట 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో నూతన బ్రేకర్‌ను ప్రారంభించిన సీఈ అశోక్. మెరుగైన విద్యుత్ సరఫరాయే లక్ష్యమని వెల్లడి.
Sircilla: చంద్రంపేట సబ్‌స్టేషన్‌లో నూతన బ్రేకర్ ప్రారంభం!
Sircilla: సిరిసిల్ల పట్టణంలోని చంద్రంపేట 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రేకర్‌ను చీఫ్ ఇంజనీర్ (ఆపరేషన్) బి. అశోక్ ఛార్జ్ చేశారు. నూతన బ్రేకర్ ఏర్పాటుతో సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాను మరింత సురక్షితంగా, విశ్వసనీయంగా నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు.
విద్యుత్ అంతరాయాలను త్వరితగతిన నియంత్రించడంతో పాటు రక్షణ వ్యవస్థను మరింత మెరుగుపరచేందుకు ఈ బ్రేకర్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఆపరేషన్) సిరిసిల్ల ఎం. శ్రీనివాస్, డివిజనల్ ఇంజనీర్ ఎన్. అంజయ్య, డివిజనల్ ఇంజనీర్ (ఆపరేషన్) వేములవాడ జి. వెంకటరామణతో పాటు ఏడీఈలు, ఏఈలు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.




