Tangallapalli: తంగళ్లపల్లిలో ప్రేమ వ్యవహారం కలకలం.. ఊరిలో వాల్ పోస్టర్లు!
Tangallapalli: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ఏడేళ్లుగా ప్రేమించుకున్న యువతికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించడంతో ప్రియుడు వినూత్నంగా నిరసన తెలిపాడు.
Tangallapalli: తంగళ్లపల్లిలో ప్రేమ వ్యవహారం కలకలం.. ఊరిలో వాల్ పోస్టర్లు!
Tangallapalli: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో ప్రేమ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏడేళ్లుగా ప్రేమించుకున్న యువతికి పెద్దలు మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారని ఆరోపిస్తూ ఓ యువకుడు వినూత్నంగా నిరసన తెలిపాడు.
సిద్దిపేట జిల్లాకు చెందిన యువకుడు, యువతి గత ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. అయితే యువతి కుటుంబ సభ్యులు ఆమెకు తంగళ్లపల్లికి చెందిన మరో యువకుడితో వివాహం నిశ్చయించారని, తమ ప్రేమను అంగీకరించకుండా బలవంతంగా ఈ పెళ్లి చేస్తున్నారని ప్రియుడు ఆరోపిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో అర్ధరాత్రి కారులో తంగళ్లపల్లికి చేరుకున్న యువకుడు, తాను యువతితో దిగిన ఫొటోతో పాటు పెళ్లి చేసుకోబోతున్న వరుడి ఫొటోను కలిపి ముద్రించిన వాల్ పోస్టర్లను గ్రామంలోని ప్రధాన కూడళ్లు, వీధులు, గోడలపై అతికించాడు. పోస్టర్లలో వరుడు, అతని తండ్రి పేర్లు, ఫోన్ నంబర్లు కూడా ముద్రించినట్లు తెలుస్తోంది.
ఉదయం గ్రామస్థులు పోస్టర్లను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. పోస్టర్లు అతికిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదైనట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




