Yellareddypet: ఈత చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి

Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో ఈత చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు గున్నాల ఎల్లయ్య (60) మృతి చెందాడు.

KALEEM, SIRICILLA
Published on: 16 Oct 2026 10:45 PM IST
Yellareddypet
X

Yellareddypet: ఈత చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కల్లు గీసేందుకు ఈత చెట్టు ఎక్కిన గీత కార్మికుడు ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు.

పదిర గ్రామానికి చెందిన గున్నాల ఎల్లయ్య (60) శుక్రవారం సాయంత్రం కల్లు గీసేందుకు ఈత చెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో చెట్టుపై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన తోటి గీత కార్మికులు వెంటనే ఆయనను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఎల్లయ్య మృతి చెందాడు.

మృతుడికి భార్య మాధవి, కుమార్తెలు రజిత, జ్యోతి ఉన్నారు. ఇటీవలే భార్య మాధవికి నరాలకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగినట్లు గీత కార్మికులు తెలిపారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పదిర గీత కార్మిక సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ కోరారు.

ఈ ఘటనపై స్థానిక ఎస్‌ఐ ఎన్. రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA