Sircilla: ఈత చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా అల్మాస్‌పూర్‌లో ప్రమాదవశాత్తు ఈత చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలు. ప్రభుత్వాసాయం అందించాలని విజ్ఞప్తి.
Sircilla: ఈత చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు నేరెళ్ల శ్రీనివాస్ ఈత చెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు.
మంగళవారం ఉదయం రోజువారీ పనిలో భాగంగా ఈత చెట్టు ఎక్కి కల్లు సేకరిస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. ఈ ఘటనలో శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తోటి గీత కార్మికులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.
శ్రీనివాస్‌కు భార్య సరోజ, కుమారుడు సాయి, కుమార్తె సంధ్య ఉన్నారు. గాయపడిన గీత కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అల్మాస్‌పూర్ గౌడ సంఘం అధ్యక్షుడు కందునూరి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు గీత కార్మికులు కోరారు.




