Sircilla: పెట్రోల్ బంక్‌లో పెట్రోల్‌తో పాటు నీరు - వాహనం ధ్వంసం

Sircilla: సిరిసిల్లలో పెట్రోల్ బంక్ నిర్లక్ష్యంపై బాధితుడు కృష్ణ ఆరోపణ. పెట్రోల్‌లో నీరు వచ్చి వాహనం పాడైందని, ప్రశ్నిస్తే బంక్ సిబ్బంది దురుసుగా సమాధానం.

KALEEM, SIRICILLA
Published on: 15 Sept 2026 10:54 PM IST
Sircilla
X

Sircilla: పెట్రోల్ బంక్‌లో పెట్రోల్‌తో పాటు నీరు - వాహనం ధ్వంసం

సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలోని ఓ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించుకున్న తర్వాత తన వాహనంలో నీరు వచ్చి వాహనం పాడైందని జిల్లెల్లకు చెందిన కృష్ణ ఆరోపించారు. పెట్రోల్ పోయించుకున్న అనంతరం వాహనం సక్రమంగా పనిచేయకపోవడంతో పరిశీలించగా నీరు వచ్చినట్లు గుర్తించామని తెలిపారు.

ఈ విషయంపై పెట్రోల్ బంక్ సిబ్బందిని ప్రశ్నించగా వారు దురుసుగా సమాధానం చెప్పారని కృష్ణ వాపోయారు. “నీ ఇష్టం ఉన్న చోట చెప్పుకో” అంటూ సిబ్బంది మాట్లాడారని ఆరోపించారు.

పెట్రోల్‌లోకి నీరు ఎలా వచ్చిందనే విషయంపై సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కృష్ణ కోరారు. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA