Sircilla: తంగళ్లపల్లి యాదవ సంఘం నిరసన, శివచరణ్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

Sircilla: ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు యూత్ కాంగ్రెస్ నేత జక్కిడి శివచరణ్ రెడ్డిపై సిరిసిల్లలో యాదవ సంఘాల నిరసన. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్.

KALEEM, SIRICILLA
Published on: 15 July 2026 2:37 PM IST
Sircilla
X

Sircilla: తంగళ్లపల్లి యాదవ సంఘం నిరసన, శివచరణ్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో యాదవ సంఘం నాయకులు నిరసన చేపట్టారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి యాదవ సమాజానికి చెందిన ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మండల యాదవ సంఘం అధ్యక్షుడు బండి దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు.

నిరసన అనంతరం జక్కిడి శివచరణ్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు మాట్లాడుతూ, ఈశ్వరమ్మపై చేసిన వ్యాఖ్యలు యాదవ సమాజ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అలా చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా యాదవ సంఘాలతో కలిసి ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే సామాజిక వర్గాల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయకుండా అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచిస్తూ, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సంక్షేమ సంఘం యూత్ అధ్యక్షుడు మోతె మహేష్ యాదవ్, రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజు, సహాయ కార్యదర్శి చెన్నవేణి తిరుపతి, ప్రచార కార్యదర్శులు లచ్చయ్య, కొమురయ్య, శ్రీధర్, గంగాధర్, శ్రీశైలం, రంగయ్య, మహేష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story