Sircilla: తీరిన రైతుల విద్యుత్ కష్టాలు బండలింగంపల్లిలో నూతన ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం!

Sircilla: ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం. సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ చొరవతో తీరిన రైతుల కష్టాలు.

KALEEM, SIRICILLA
Published on: 6 Sept 2026 1:44 PM IST
Sircilla
X

Sircilla: తీరిన రైతుల విద్యుత్ కష్టాలు బండలింగంపల్లిలో నూతన ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం!

Sircilla: బండలింగంపల్లి గ్రామంలో రైతుల విద్యుత్ సమస్యలకు పరిష్కారం లభించింది, రైతుల విజ్ఞప్తి మేరకు గ్రామ సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ చొరవతో నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు.

గతంలో వ్యవసాయ పొలాలకు విద్యుత్ సరఫరాకు సంబంధించి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సర్పంచ్ వెంటనే సంబంధిత ఏఈతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గ్రామంలోని SS-59 రూరల్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ సమస్యను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో వ్యవసాయ పనులకు విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ బొడ్డు రాజు, వార్డు సభ్యులు కొత్తపెళ్లి వజ్ర నర్సింలు, కోడుముంజ మనుషా రాజు, మార్పు బాలచందర్, బొడ్డు మహేష్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఎల్లా గౌడ్, శివాలయ కమిటీ చైర్మన్ నర్రా అంజిరెడ్డి, నాయకులు రమేష్ గౌడ్, సాయి గౌడ్, మాచర్ల బాలకృష్ణ, కానికే మల్లయ్య, ఎలసాని పాపిరెడ్డి, చింతకుల దేవయ్య, కొడుముంజ దేవయ్య, కొండే రాజిరెడ్డి, మాచర్ల దేవరాజు, సాగర్, క్రాంతి, NPDCL సిబ్బంది హెల్పర్ నవీన్, బొడ్డు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story