Sircilla: సిరిసిల్లలో ఘనంగా యువజన కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ!

Sircilla: సిరిసిల్ల నియోజకవర్గంలో ఘనంగా యువజన కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ. అధ్యక్షుడు చుక్క రాజశేఖర్ ఆధ్వర్యంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.

KALEEM, SIRICILLA
Published on: 9 Aug 2026 1:58 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో ఘనంగా యువజన కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ!

Sircilla: సిరిసిల్ల నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చుక్క రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చుక్క రాజశేఖర్ మాట్లాడుతూ.. యువత సమాజ మార్పునకు, దేశ పురోగతికి వెన్నుముక లాంటిదని అన్నారు. రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా యువజన కాంగ్రెస్ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని పేర్కొన్నారు.

యువత ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం గళమెత్తుతామని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతామని చుక్క రాజశేఖర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు పోగుల దేవరాజు రెడ్డి, సీనియర్ నాయకులు గుడిసె ప్రభాకర్, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎడ్ల తిరుపతి, యువజన కాంగ్రెస్ నాయకులు సోహెల్, సాయి, సతీష్, అరుణ్, సైబజ్, సాహిల్ తో పాటు పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story