Sircilla: సిరిసిల్ల మండి బిర్యానీ తిని నలుగురు యువకులు అస్వస్థత

Sircilla: సిరిసిల్లలోని బకాసుర రెస్టారెంట్‌లో మండి బిర్యానీ తిన్న నలుగురు యువకులు అస్వస్థత. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో ప్రజల్లో ఆందోళన. అధికారుల తనిఖీలకు డిమాండ్.

KALEEM, SIRICILLA
Published on: 16 July 2026 4:59 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల మండి బిర్యానీ తిని నలుగురు యువకులు అస్వస్థత

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. సిరిసిల్ల పట్టణంలోని బకాసుర రెస్టారెంట్‌లో మండి బిర్యానీ తిన్న నలుగురు యువకులు కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.

బాధితుల్లో ఒకరిని వెంటనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా, మరో ముగ్గురికి సమీపంలోని ఆర్ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేశారు. కలుషిత ఆహారం తీసుకోవడం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ఫుడ్ సేఫ్టీ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story