Sircilla: సిరిసిల్ల జిల్లాలో యువకుడి ఆత్మహత్య కలకలం

Sircilla: రాజన్న రాచర్ల గొల్లపల్లిలో వంశీ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. SIR ఫారంపై ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

KALEEM, SIRICILLA
Published on: 23 July 2026 12:33 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల జిల్లాలో యువకుడి ఆత్మహత్య కలకలం

రాజన్న సిరిసిల్ల జిల్లా:

సిరిసిల్ల: SIR ఫారంపై సూసైడ్ నోట్.. యువకుడి ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో వంశీ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.

ఘటన స్థలంలో లభించిన SIR ఫారంపై రాసిన నోట్‌లో తన మరణానికి ప్రధాని నరేంద్ర మోదీ కారణమని పేర్కొన్నట్లు పోలీసులు గుర్తించారు.

అలాగే తన మరణానికి సంబంధించి ఎవరినీ నిందించవద్దని, ఆనవాయితీ ప్రకారం తన అంత్యక్రియలు నిర్వహించాలని కూడా నోట్‌లో రాసినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, సూసైడ్ నోట్‌తో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story